సరిహద్దులో మరోసారి తోక జాడించిన పాకిస్థాన్

  • కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్
  • జమ్మూకశ్మీర్ సరిహద్దులో కాల్పులకు తెగబడిన పాక్ రేంజర్లు
  • దీటుగా బదులిస్తున్న భారత బలగాలు
అంతర్జాతీయ ఒప్పందాలను, ద్వైపాక్షిక ఒప్పందాలను, శాంతి ఒడంబడికలను తుంగలో తొక్కడం పాకిస్థాన్ కు కొత్తకాదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్ సరిహద్దులో కాల్పులకు తెగబడింది. భారత్ ఎంత స్వీయనియంత్రణ పాటిస్తున్నా పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు ఆగడంలేదు. తాజాగా, పూంచ్ జిల్లాలోని కేజీ (కృష్ణా ఘాటీ) సెక్టార్ లో పాక్ రేంజర్లు భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. ప్రస్తుతం కేజీ సెక్టార్లో హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి.
Go Back to Shorts
Pakistan
India
Jammu And Kashmir
Poonch

More Telugu News